ఒక సామాన్యుడి కల….

ప్రకటన అనేది చాలా ఖరీదుతో కూడు కున్న అంశం.
నాలుగు లైన్ల ప్రకటన స్థానిక పేపర్లో ఇవ్వాలన్నా కనీసం 400 రూపాయల ఖర్చు…
దీనికి తోడు జి.యస్.టి.
ఎంతమంది చూస్తారు ?
అసలు ప్రకటన ఎందుకివ్వాలి?
ఎవరి కోసం?
నాలో చిన్న సంఘర్షణ.

నిజానికి వ్యాపార పరంగా ప్రతిరోజు మనం కలిసే 90 శాతం మంది, ఎవరూ తమ గురించి, తమ సంస్థ గురించి, ప్రకటనలను ఇవ్వనివారినే. అంటే 90% వ్యాపార సంస్థలు, అనేక కారణాల రీత్యా ప్రకటనలు ఇవ్వరు.
ఏదైనా పెద్ద పెద్ద సంస్థలు ప్రకటనలు ఇచ్చారంటే దాని ఉద్దేశ్యం వేరే వుంటుంది.
కాని ఎక్కువ మంది అవసరాలు తీర్చే ఈ చిన్న సంస్థలు, వ్యక్తులు ప్రకటనలు ఇవ్వరు కాని అందరికీ వారితో అవసరం వుంటుంది.
ఇటువంటి వారికోసం గూగుల్ లో వెతికినా కనపడరు. వారిని పట్టుకోవటానికి నానా శ్రమ పడాలి. ఓ పట్టాన దొరకరు. ఎందుకంటే ప్రకటన అనేది చాలా ఖరీదు గా మారింది కనుక.

అసలు వారినందరిని ఓ త్రాటిపైకి తీసుకు రావాలంటే (వారెవరు ప్రకటనలు ఇవ్వరు కదా) ఎలా?

అందుకే సామాన్యునికి, చిన్న వ్యాపార సంస్థలకు అసమాన్యమైన సేవలు అందించాలనే వుద్దేశ్యంతో ప్రారంభించబడిందే ఈ మా వాసవీ క్లాసిపైడ్స్ అనే ఆన్ లైను ప్రకటనల సంస్థ.

సరే మా సంస్థ వల్ల ఎవరెవరికి అవసరం, ఏమేమి ఉంటాయి, ఎలా చూడాలి, ఎంత కట్టాలి. అసలు ఎందుకు కట్టాలి. నాకేంటి.

ఇలా సవాలక్ష ప్రశ్నలు.

వాసవీ క్లాసిపైడ్స్ చేస్తున్న, చేయబోతున్న కార్యక్రమాలు క్లుప్తంగా :

  • 1 – వాసవీ క్లాసిఫైడ్స్ రక్షణతో కూడిన నిబద్దమైన సంస్థ. ఇందులో తప్పుడు ప్రకటనలు, అబద్దపు ప్రకటనలు, మోస పూరిత ప్రకటనలు ఉండవు. ఎందుకంటే వ్యాపారసంస్థల, వ్యక్తుల వివరాలను పరిశీలించి ప్రకటనలు తీసుకుంటాం. అసత్యమైన, తప్పుడు ప్రకటనలకు వారినే భాద్యులు చేస్తాం…
  • 2 – ఇందులో ఏ వృత్తి పనివారైనా, ఏ చిన్న వ్యాపారస్తుడైనా నమోదు చేసుకోవచ్చు.
  • 3 – మీ వివాహ వేడుకలు, వేదిక వివరాలు, రూట్ మాప్ లతో సహా అనుసంధానించబడతాయి.
  • 4 – అలాగే మీ ఊరి ఆలయాల పర్వదినాలు తెలియచేస్తూ వీడియోలు కూడ ఉంచబడతాయి
  • 5 – విద్యా సంస్థలు, వైద్య శాలలు, ధర్మశాలలు, ఆలయాలు, వ్యాపార సంస్థలు, వివిధ వృత్తుల వారు, వారివారి పూర్తి సమాచారం, వారికి చెందిన ఫోటోలు, వీడియోలు, చిరునామా రూట్ మాప్, కస్టమర్ల అభిప్రాయాలు, స్టార్ రేటింగులు అన్నీ వుంటాయి.
  • 6 – ఏ వూరి వారైనా ఎక్కడి వారైనా ఈ సైట్ లో నమోదు చేసుకోవచ్చు. వారి వారి మిత్రులకు, బంధువులకు, స్నేహితులకు మీ గురించిన ప్రకటన పంపుకోవచ్చు.
  • 7 – ఏ చిన్న పని చేసేవారైనా నమోదు చేసుకోవచ్చు.
  • 8 – ఒక్కసారి నమోదు చేసుకుంటే ఏడాది పాటు మీ మీ వృత్తిని, వ్యాపారాన్ని మీ వెబ్ పేజీద్వారా ప్రమోట్ చేసుకోవచ్చు.
  • 9 – మీ వస్తువులు, సేవల వివరాలను చాలావివరంగా తెలియచేసుకోవచ్చు.. అమ్ముకోవచ్చు
  • 10 – రకరకాల వస్తువులు, సేవల గురించి రాయితీల గురుంచి తెలుసుకోవచ్చును…

ఎంత చెల్లించాలి అనే కదా మీ సందేహం. అదేమంత పెద్ద మొత్తం కాదులేండి. కేవలం 6 నెలలకు 1500, సంవత్సరానికైతే 2500 రూపాయలు మాత్రమే… (జి.యస్.టి.తో సహా) చెల్లిస్తే మీ పేరుతో వెబ్ పేజీ తయారు చేసి, నిర్వహిస్తాము…