వాసవి క్లాసిఫైడ్స్
మీ వృత్తి, వ్యాపారాలు, అత్యంత నాణ్యమైన సౌకర్యాలతో, ఆధునిక సేవలు
అతి తక్కువ వెలతో అందించే ఏకైక సంస్థ
వాసవి క్లాసిఫైడ్స్
మా వాసవి క్లాసిఫైడ్స్ అందించే సేవలు
మీకు సేవలు అందించే వారి వివరాలు అనగా వారి చిరునామా, మొబైల్, ఆధార్ వివరాలు, ఫోటో మా వద్ద భద్రంగా వుంటాయి. అందువల్ల మీకు సేవలు అందించే వారు నమ్మకమైన సేవలు అందిస్తారు.
మీకు సేవలు అందించే వారు ఆన్ లైనులో ఎంతమంది అందుబాటులో వున్నారో తెలుస్తుంది.
సెర్చి ఆప్షన్ తో మీకు దగ్గరలో ఎవరు ఏఏ సేవలు అందిస్తారో వెంటనే తెలుసుకో గలుగుతారు.
మీకు సేవలు అందించేవారి వ్యాపారం మరియు వృత్తికి సంబంధించిన వెబ్ పేజీ పూర్తి సమాచారంతో తయారుచేయ బడుతుంది.
అలాగే వారి చిరునామా కూడ గూగుల్ మాప్ తో అనుసంధానింప బడుతుంది. మీరు చాలా సులభంగా ఆయా ప్రదేశాలను చేరుకోగలరు.
మీకు సేవలు అందించే వారు వారి వారి వెబ్ పేజీని స్వయంగా నిర్వహించు కోగలరు. ఇంకా
ఎవరైనా వారి వారి వస్తు, సేవలు రాయితీలతో అందించాలంటే ఆయా వివరాలు కూడ ప్రజలకు తెలియచేయవచ్చు. అలాగే అనుభవజ్ఞుల సలహాలు కూడ తీసుకోవచ్చు.
- కేవలం 30 నిముషాలలో మీ పేరుతో వెబ్ పేజీ తయారు చేసుకోవచ్చు.
- ఇందులో మీ వృత్తి మరియు వ్యాపారం గురించి ఏఏ వివరాలు ప్రజలకు తెలియ చేయదలచుకున్నారో ఆయా వివరాలు అన్నీ తెలియచేయవచ్చు. ఇందులో మీ చిరునామా, ఫోటోలు, వీడియో (1 నిముషం పాటు) ద్వారా కూడా తెలియ చేయవచ్చు.
- అలాగే మీరు ఒకసారి నమోదు చేసిన వివరాలను మరలా సవరించుకోవచ్చు. అలాగే ఫోటోలు, సమాచారం మార్చుకోవచ్చు. ఏవైనా బహుమతులు, రాయితీలు ఇవ్వదలచుకున్నారో ఆ వివరాలు కూడ మీ వెబ్ పేజీలో ఉంచవచ్చు.
- నేటి తరానికి ఆన్ లైను ద్వారా ఇచ్చే సమాచారం వల్లనే ఏ వృత్తి అయినా, వ్యాపారమైనా అభివృద్ధి చెంది ప్రజలకు చేరువౌతుంది. లేక పోతే ఈ సమాజంలో ఎంత నైపుణ్యం, నాణ్యత వున్నా వెనకబడటం చూస్తూనే వున్నాం. కనుక ఆన్ లైను ద్వారా చేసుకొనే ఏ వ్యాపారమైనా, కార్యక్రమమైనా అతి తక్కువ సమయంలో వేగంగా ప్రజలకు చేరుతుంది. అటువంటి సేవలను వాసవీ క్లాసిఫైడ్స్ అత్యంత తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలను అందిస్తుంది.
- మీ గురించిన వ్యాపారమైనా, పరిచయమైనా, కార్యక్రమమైనా మీరు ఇచ్చిన చిరునామాకు గూగుల్ మాప్ తో అనుసంధానం అవుతుంది.
- మీ సమాచారాన్ని, కార్యక్రమాన్ని, వ్యాపారాన్ని సోషల్ నెట్ వర్కుద్వారా మీరు మీ మీ ఆప్తులకు, మిత్రులకు, పరిచయస్తులకు మీకు ఇచ్చిన లింకు ద్వారా మీ చెప్పదలచుకున్న సమాచారం అత్యంత సులభంగా చేరవేయవచ్చు.
- మీరు ఇచ్చిన సమాచారం సెక్యూరిటీ వ్యవస్థ ద్వారా వాసవీ క్లాసిఫైడ్సు ద్వారా పరిశీలించబడిన తరువాతనే ప్రకటించబడుతుంది.
- అలాగే వాసవీ క్లాసిఫైడ్స్ అందించే మరో వినూత్న సేవ ప్రీమియం సేవ. ఈ సేవ కావాలనుకుంటే మరికొంత సొమ్మును వెచ్చిస్తే కాల్ సెంటరు ద్వారాను, డిజిటల్ మార్కెటింగ్ ద్వారాను, మీ సమాచారాన్ని, వ్యాపారాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తుంది.
- రిజిస్టరు అయిన కస్టమర్లకు అనుభవజ్ఞులైన ప్రముఖులచేత వ్యాపార మెలకువలను తెలియ చేస్తుంది. అందువల్ల మీ వృత్తి, వ్యాపారాలను మరింత వృద్ధిచేసుకునే అవకాశం ఉంది.
కష్టమర్లకు అందించే మరో అద్భుతమైన సేవ
- ఇందులో నమోదు చేసుకున్న వ్యాపారస్తుల గురించిన వివరాలు గాని, వృత్తి నిపుణుల గురించిన వివరాలు, దాదాపు పూర్తిగా పరిశీలించి ఆమోదించటం వల్ల మా వాసవీ క్లాసిఫైడ్స్ ద్వారా సేవలు పొందే వారు నాణ్యమైన సేవలు పొందగలరని విశ్వసిస్తున్నాం.
- అలాగే వాసవీ క్లాసిఫైడ్స్ ద్వారా నమోదు చేసుకున్న వారి ద్వారా సేవలు పొందిన వారికి ఆకస్మిక బహుమతులు కూడ పొందే అవకాశం వుంది.
- మా వాసవీ క్లాసిఫైడ్స్ అందించే వివరాల ద్వారా వినియోగదారులు వారికి సేవలు అందించినవారికి తమ తమ రేటింగ్ ల ద్వారా ఉత్తమ వ్యాపారులుగాను, ఉత్తమ వృత్తి నిపుణులుగాను గుర్తింపు పొందుతారు. అందువల్ల సమాజంలో వారికి ప్రత్యేక గుర్తింపు కలుగుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రేటింగ్ అనేది వినియోగదారుల చేతులో బ్రహ్మస్త్రమే కాదు అభయహస్తం కూడ. ఊహించలేనంత ఆదరణ పొందవచ్చు.
జిల్లావారి బ్రాంచీలకు అందించే ప్రత్యేక లాభాలు
- జిల్లా వారి వ్యవస్థాపకులుగా వాసవీ క్లాసిఫైడ్స్ సేవలు అందించాలని కోరుకునే వారు తప్పని సరిగా 2 లక్షలు కాషన్ డిపాజిట్ చెల్లించవలసి వస్తుంది. మీరు వ్యవస్థాపకులుగా మీ జిల్లాలో సేవలు ఉపసంహరించుకునే పక్షంలో మీరు చెల్లించిన డిపాజిట్ వడ్డీ రహితంగా తిరిగి చెల్లించే సదుపాయం కలుగ చేస్తుందీ వాసవీ క్లాసిఫైడ్స్.
- ప్రతి జిల్లాలోని వాసవీ క్లాసిఫైడ్స్ శాఖా వ్యవస్థాపకులు వారి అనుమతిని ప్రతి సంవత్సరం నిబంధనలకు లోబడి కాలవ్యవధిని పెంచుకోవచ్చును.
- జిల్లా శాఖా వ్యవస్థాపకులు వారు ప్రకటనల కొరకు వసూలు చేసిన సొమ్ములో 30 శాతం మొత్తాన్ని నిర్ణీత సమయంలో అంటే ప్రతి 15 రోజులకు గాని లేక 30 రోజులకు గాని వారి వారి ఖాతాలలో జమచేయబడుతుంది.